Karthika Deepam2 : ఇల్లు తాకట్టు పెట్టాలని చూస్తున్న అనసూయ.. దీప చీపురకట్టతో సమాధానం!
on Dec 26, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -238 లో......శౌర్య కొన్ని రోజులు లగ్జరీకి అలవాటు అవడం వల్ల.. ఆ చిన్న ఇంట్లో ఉండలేక పదే పదే ఇక్కడ నచ్చడం లేదని అంటుంది. భోజనం కింద కూర్చొని తినాలా అంటుంది. ఎందుకు అలా అంటున్నావ్.. సుమిత్ర గారి అవుట్ హౌస్ లో ఉన్నప్పుడు కింద కూర్చొని తిన్నాము.. మన ఊళ్ళో కూడ కింద కూర్చొని తిన్నాము.. అంటూ శౌర్య పైన కోప్పడుతుంది దీప. ఆ తర్వాత శౌర్యకి కార్తీక్ నచ్చజెప్పి భోజనం తినిపిస్తాడు.
మరుసటిరోజు ఉదయం కాంచన దగ్గరికి అనసూయ వచ్చి.. నేను ఊరు వెళ్తున్నాను.. ఊళ్ళో ఉన్న ఇల్లు తాకట్టు పెట్టి వస్తాను. ఇక్కడ డబ్బు అవసరం కదా అని అనసూయ అనగానే.. వద్దని కాంచన అంటుంది. అయిన వెళ్తానని అనసూయ చెప్తుంది. ఇలా మీకు లేకున్నా సాయపడాలన్న గొప్ప గుణం ఉందని కాంచన అనగానే.. గొప్పవాళ్లతో ఉంటున్నా కదా అని అనసూయ అంటుంది. ఈ విషయం దీపకి చెప్పకండి అని చెప్తుంది. ఆ తర్వాత కార్తీక్ రెడీ అవుతూ దీపని అద్దం పట్టుకోమని చెప్తాడు. కార్తీక్, దీప ఇద్దరు ప్రేమగా చూసుకుంటారు.
ఆ తర్వాత అమ్మ నేను జాబ్ చూసుకోవడానికి వెళ్తున్నానని కార్తీక్ అంటాడు. అనసూయ గారు ఎక్కడ.. తనకి కూడా ఒక మాట చెప్పి వెళ్తానని కార్తీక్ అనగానే.. తను ఊరు వెళ్ళింది పని మీద అని కాంచన అంటుంది. నాకు చెప్పకుండా వెళ్ళిందని దీప అంటుంది. నువ్వు కార్తీక్ కి ఎదరురా దీప అని కాంచన అంటుంది. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. ఇక ఎప్పటిలాగే ఏదో ఒకటి గొడవ పెట్టుకోవాలని ట్రై చేస్తుంది. తనకి కౌంటర్ ఇచ్చి కార్తీక్ వెళ్ళిపోతాడు. ఇక కాంచన కూడా చిరాకుపడుతూ వెళ్లిపోయే అంటుంది. ఆ తర్వాత దీప కూడా వెళ్ళిపో అంటూ డోర్ వెయ్యబోతుంటే.. దీపని తిడుతుంది జ్యోత్స్న. నేను తల్చుకుంటే నువ్వు ఎక్కడ ఉంటావని జ్యోత్స్న అనగానే.. నువ్వు తలుచుకోమని దీప చీపురు కట్ట తీసుకొని రాగానే.. జ్యోత్స్న భయపడుతూ మాములుగా మాట్లాడాతున్న కదా అంటూ కవర్ చేస్తూ వెళ్ళిపోతుంది. దీని సంగతి తర్వాత.. బావ ఎక్కడికి వెళ్ళాడోనని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read